'మెగా లోక్ అదాలత్ చలానాలు చెల్లించాలి'
KRNL: మెగా లోక్ అదాలత్ సందర్భంగా వాహనదారులు తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలను స్వచ్ఛందంగా చెల్లించాలని ఆదోని ట్రాఫిక్ సీఐ గౌస్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. భారీగా రికవరీ జరిగితే ఆలస్యం, సమయ వృథా తప్పదన్నారు. ఫోన్ పే యాప్, ఈ-చలాన్ డాట్ కామ్, మీ సేవ కేంద్రాలు లేదా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో చలానాలు చెల్లించి రసీదు పొందవచ్చన్నారు.