సుంకేసుల బ్యారేజీకి పెరిగిన వరద

సుంకేసుల బ్యారేజీకి పెరిగిన వరద

GDWL: కర్ణాటకలోని టీబీ డ్యాం గేట్లు ఎత్తడంతో రాజోలి మండల కేంద్రం సమీపంలోని సుంకేసుల బ్యారేజీకి వరద పెరిగింది. శుక్రవారం ఉదయం బ్యారేజీకి ఇన్‌ఫ్లో 39,000 క్యూసెక్కులు వస్తోంది. దీంతో బ్యారేజీ 9 గేట్లు ఒక మీటరు మేర ఎత్తి 36,686 క్యూసెక్కులు, కేసీ కెనాలు 2,012 క్యూసెక్కులు, మొత్తం 38,698 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.