సర్వసభ్య సమావేశంలో ఎంపీ ఆగ్రహం
VZM: జడ్పీ సమావేశ మందిరంలో గురువారం జరిగిన సర్యసభ్య సమావేశంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన MP నిధులు వినియోగించకపోవడంపై ఆరకు MP తనూజారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకరరెడ్డిని ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ 2024లో రూ.2 కోట్లతో 32 పనులు, అనంతరం మరో 40 పనులకు నిధులు కేటాయించినప్పటికీ అమలు జరగలేదని పేర్కొన్నారు.