కీర్తనకు జాతీయ కథల పోటీలో ప్రథమ బహుమతి
MDK: బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీలలో తొమ్మిదవ తరగతి విద్యార్థిని కీర్తన ప్రథమ బహుమతికి ఎంపికైంది. మెదక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్‌కు చెందిన కీర్తనకు 23నవంబర్‌న హైదరాబాద్‌లో రెండు వేల రూపాయల నగదు, మెమెంటో, ప్రశంసపత్రం అందజేస్తారు. ఈ విజయం పట్ల ప్రధానోపాధ్యాయులు అభినందించారు.