VIDEO: కాటారంలో యూరియా కోసం రైతుల క్యూలైన్లు

BHPL: కాటారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు ఉదయం నుంచే క్యూలైన్లో వేచి ఉన్నారు. సొసైటీకి 444 బస్తాల యూరియా రాగా, లైన్‌లో నిలుచున్న కొంతమంది రైతులకే యూరియా బస్తాలు అందాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మండలానికి అధిక మొత్తంలో యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.