దాడుల నేపథ్యంలో ఇరాన్ పిలుపు
హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ కేంద్రాల వద్దకు ర్యాలీగా రావాలని క్రీడాకారులు, విద్యార్థులతో సహా యువతకు ఆ దేశ క్రీడలు, యువజన మంత్రిత్వశాఖ పిలుపునిచ్చింది. యువత నుంచి వచ్చిన సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ ఉప మంత్రి అలీ రెజా తెలిపారు.