నేడు ఒంగోలుకు వందేమాతరం శ్రీనివాస్

ప్రకాశం: ఒంగోలులో నేటి నుంచి 24 వరకు జరిగే కళా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్ర నాయక్ పేర్కొన్నారు. ఒంగోలులోని పీవీఆర్ హైస్కూల్ ఆవరణంలో కళా ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను వారు విడుదల చేశారు. బుధవారం కళా ఉత్సవాల ప్రారంభోత్సవానికి సినీ రంగ ప్రముఖులు వందేమాతరం శ్రీనివాస్, గోరేటి వెంకన్న,పలువురు హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు.