'గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ప్రారంభించాలి'
VZM: బొబ్బిలి మండలం కోమటిపల్లిలోని జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఇంటర్ తరగతులు ప్రారంభించాలని ఎమ్మెల్యే బేబినాయన రాష్ట్ర మంత్రి సవితను కోరారు. ఈమేరకు అమరావతిలో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడంతో పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించారు.