పేదల ఇళ్లు కూల్చడం సరికాదు: తంబళ్ల రవి

పేదల ఇళ్లు కూల్చడం సరికాదు: తంబళ్ల రవి

BDK: అశ్వరావుపేటలో ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించడం సరికాదని తుడుం దెబ్బ నాయకులు తంబళ్ల రవి అన్నారు. నిన్న బాధితులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పేదల గుడి సెలను కూల్చడం అన్యాయమని, కాంగ్రెస్‌కు నమ్మకంగా ఓటు వేసి గెలిపించిన పేదలు రోడ్డుపైకి రావడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.