ఘనంగా గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి వేడుకలు

JGL: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో శుక్రవారం రోజున శ్రీరాంయూత్, యువజనసంఘాల ఆధ్వర్యంలో బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు గిడుగు వెంకట రామ్మూర్తి 162వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగు భాషాభివృద్ధికి రామ్మూర్తి చేసిన సేవలను కొనియాడారు. మహేష్, శ్రీనివాస్, కన్నయ్య, శ్రీధర్, మారుతి పాల్గొన్నారు.