అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత
VKB: అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను ఇవాళ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. బషీరాబాద్ మండల పరిధిలోని కాశీంపూర్ గ్రామ శివారులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి మూడు ట్రాక్టర్లపై కేసు నమోదు చేశారు.