బంజారాహిల్స్‌లో క్రాస్ మసాజ్.. వ్యభిచారం

HYD: బంజారాహిల్స్ రోడ్డు నంబర్-7లో బోయిని బసవరాజు అనే వ్యక్తి స్మైలీ బ్యూటీ స్పాను నిర్వహిస్తున్నాడు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం, క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు సోదాలు నిర్వహించి నిర్వాహకులను అరెస్టు చేసి సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు.