రీసర్వేతో భూ సమస్యలకు పరిష్కారం: MLA

NLR: CM చంద్రబాబు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని కోవూరు MLA ప్రశాంతి రెడ్డి తెలిపారు. కోవూరు మండలం వేగూరులో నిర్వహించిన రీసర్వే గ్రామసభలో నెల్లూరు ఆర్డీఓ అనూషతో కలిసి ఆమె పాల్గొన్నారు. రీసర్వే ద్వారా హద్దులు నిర్ణయించి ప్రభుత్వమే రాళ్లు ఏర్పాటు చేస్తుందన్నారు. పాత భూ రికార్డుల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని రైతులకు సూచించారు.