దుప్పులపాడులో పిడుగు పడి ఒకరు మృతి

దుప్పులపాడులో పిడుగు పడి ఒకరు మృతి

SKLM: కోటబొమ్మాళి మండలం దుప్పలపాడు గ్రామంలో బుధవారం పిడుగు పడి డొక్కరి వీరాస్వామి(41) అనే వ్యక్తి మృతి చెందాడు. గ్రామంలో పొలం పనుల్లో ఉన్న సమయంలో ఆకస్మాత్తుగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. శవాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు కోటబొమ్మాలి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.