స్వచ్ఛాంధ్ర ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్

స్వచ్ఛాంధ్ర ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్

PLD: ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శనివారం వినుకొండలో జరిగిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులతో కలిసి చీపురు పట్టి చెత్తను శుభ్రం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, శుభ్రమైన పరిసరాల వల్ల ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారన్నారు.