VIDEO: 'రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే వారే లక్ష్యం'
HYDకింగ్ కోఠి ప్రాంతంలో ఆకతాయి కుర్రాలు రెచ్చిపోతున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించగా, అది కిందపడిపోయింది. ఈ దృశ్యాలను వెనుక వస్తున్న వాహనదారుడు వీడియో తీశాడు. దీంతో స్థానికులు పోలీసులు పెట్రోలింగ్ పెంచి, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.