ఎస్సారెస్పీ గేట్ల మూసివేత

ఎస్సారెస్పీ గేట్ల మూసివేత

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద తగ్గుముఖం పట్టడంతో గేట్లను మూసివేశారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 29,545 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. బుధవారం రాత్రి 8 వరద గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలిన అధికారులు గురువారం ఉదయం గేట్లను మూసివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.501 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం అదే స్థాయిలో నీరు నిల్వ ఉంది.