గుడుంబా స్థావరాలపై మెరుపు దాడులు

గుడుంబా స్థావరాలపై మెరుపు దాడులు

MNCL: కోటపల్లి మండలంలోని అల్గాం గ్రామంలో గుడుంబా స్థావరాలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో దాదాపు 1500 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే పారబోశారు. అలాగే నలుగురు మహిళల నుంచి 70 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. రూరల్ సీఐ కృష్ణ, ఎక్సైజ్ సీఐ శ్రీహరి పాల్గొన్నారు.