మృదువైన పెదవుల కోసం ఈ చిట్కాలు..!
మృదువైన పెదవుల కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే ఫలితం ఉంటుంది. రోజూ తగినంత నీరు తాగి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచాలి. నాణ్యమైన లిప్ బామ్ రాస్తూ పెదవుల పొడిబారకుండా చూడాలి. తేనె, చక్కెర కలిపి మెల్లగా పెదవులపై స్క్రబ్ చేస్తే మృతకణాలు తొలగిపోతాయి. ముఖ్యంగా పెదవులను నాలుకతో తడపడం మానేయాలి. పడుకునే ముందు నెయ్యి లేదా బాదం నూనె రాస్తే పెదవులు కోమలంగా మారుతాయి.