VIDEO: 'కార్యకర్తలకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది'
SKLM: కాశీబుగ్గ తొక్కిసిలాట ఘటనలో టీడీపీ కార్యకర్త డొక్కరి అమ్ముల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు టీడీపీ పార్టీ సభ్యత్వ భీమా ద్వారా మంజూరైన రూ.5 లక్షల చెక్కును ఎమ్మెల్యే శిరీష గురువారం తన కార్యాలయంలో ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపదలో ఉన్న కార్యకర్తలకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.