పోచారం ప్రాజెక్టులోకి 782 క్యూసెక్కుల వరద నీరు
KMR: నిజాం కాలం నాటి పోచారం ప్రాజెక్టులోకి ఈ ఖరీఫ్ సీజన్‌లో వరద కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉదయం ప్రాజెక్టులోకి 782 క్యూసెక్కుల స్వల్ప వరద వస్తుందని ప్రాజెక్టు డీఈ షేర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరద మంజీరలో పడి నిజాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలోకి వెళ్తుంది. ఈసారి 29.410 టీఎంసీల వరద రావడం రికార్డు స్థాయిలో చరిత్ర సృష్టించింది.