మంత్రి దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఎంపీ వద్దిరాజు
KMM: BRS పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. పలు సమస్యలను ప్రస్తావిస్తూ వినతిపత్రం అందజేశారు. నిన్న సాయంత్రం పార్లమెంట్ ప్రాంగణంలోని గడ్కరీ ఛాంబర్‌లో ఆయనను కలిసి తెలంగాణలోని ప్రధానమైన రోడ్ల విస్తరణ, అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.