నూతన వధూవరులకు ఆశీర్వదించిన జగన్

NDL: నంద్యాల జిల్లా డోన్‌లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులు అనన్య రెడ్డి, బుగ్గన అర్జున్ అమర్నాథకు వివాహ శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించారు. అనంతరం వివాహ రిసెప్షన్‌లో పాల్గొన్న నాయకులను, అభిమానులను వైఎస్ జగన్ ఆత్మీయంగా పలుకరించారు.