VIDEO: 'జీతం పెంచమంటే దొంగతనం నేరం మోపారు'
NZB: జీతం పెంచమని కోరినందుకు యజమాని తమపై తప్పుడు కేసులు బనాయించారని నిజామాబాద్ నగరానికి చెందిన ప్రశాంత్ కుమార్, కన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సాయిబాబా గోల్డెన్ సిల్వర్ మర్చంట్లో 6 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు నెలకు రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. దీపావళి సందర్భంగా వేతనం రూ.15 వేలకు పెంచాలని కోరగా, తమపై దొంగతనం చేశామని నేరం మోపారన్నారు.