గత రాత్రి కురిసిన వర్షంకి రూ.10లక్షలు పంట నష్టం

ATP: కంబదూరు మండలం గుద్దెళ్ల గ్రామంలో లీలావతి, గుద్దెళ్ల హారి అనే ఇద్దరి రైతులకు సంబంధించిన 10 ఎకరాల పొలం నందు కాకరకాయ, బీరకాయ పంట సాగు చేశారు. గత రాత్రి కురిసిన వర్షంకి చేతి కొచ్చిన బీర కాయ, కాకర కాయపంట కుప్ప కూలి నేలపాలైంది. దీంతో రూ.10లక్షలు వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.