నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
ప్రకాశం: పామూరు పట్టణంలో కొత్త విద్యుత్ లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ మస్తాన్ తెలిపారు. ఆకుల వీధి, దేవాలయం వీధి, పోలేరమ్మ గుడి, పశువుల ఆసుపత్రి, పాత ఎంఆర్‌వో కార్యాలయం పరిసరాల్లో విద్యుత్ నిలిపి వేస్తున్నామని తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.