ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నూతన అధ్యక్షుడి ఏకగ్రీవ ఎన్నిక
విశాఖ జిల్లా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కొఠారు ఈశ్వరరావు ఆరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర నాయకత్వం సూచనల మేరకు ప్రతి ప్రభుత్వ శాఖకు ప్రాతినిధ్యం కల్పిస్తూ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉద్యోగుల సంక్షేమం, పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఆయనకు అభినందనలు తెలిపారు.