CMRF చెక్కులను అందజేసిన శాసనమండలి ఛైర్మన్
నల్గొండలో CMRF పథకం ద్వారా 40 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 15,20,500/- చెక్కులను ఈరోజు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కొరకు నిరంతరం కృషి చేస్తోందన్నరు. CMRF పథకం పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.