పెళ్లి పుకార్లపై సీనియర్ హీరోయిన్ క్లారిటీ
సీనియర్ హీరోయిన్ మీనా రెండో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీటిపై మీనా స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ప్రస్తుతం తాను తన పాపతో హ్యాపీగా ఉన్నట్లు పేర్కొంది. ఏ హీరో విడాకులు తీసుకున్నా.. ఆ హీరోతో తన పెళ్లి అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని, దయచేసి అలాంటివి ప్రచారం చేయకండి అని వెల్లడించింది.