VIDEO: దేవనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ
KRNL: దేవనకొండ PHCని జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారి శైలజ, డీపీఎంవో విజయ్ రాజు ఇవాళ తనిఖీ చేశారు. మాతా శిశు ఆరోగ్య సేవలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ఆరోగ్య సిబ్బంది అందిస్తున్న సేవల నాణ్యత, శిశు-మాతా ఆరోగ్య పర్యవేక్షణ రిజిస్టర్లు సక్రమంగా ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి శైలజ సూచించారు.