గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు

JGL: కోరుట్ల మండే ఐలాపూర్ నుంచి కోరుట్లకు గంజాయి అమ్మేందుకు వస్తున్నారనే సమాచారం మేరకు SI చిరంజీవి తన సిబ్బందితో ఇద్దరు వీఆర్ఎల సమక్షంలో ఐలాపూర్ రోడ్లో శనివారం వాహన తనిఖీలను చేపట్టారు. ఐలాపూర్‌కు చెందిన నల్ల విశాల్ అనే వ్యక్తి స్కూటీలో తనిఖీ చేయగా.. 100 గ్రాముల గంజాయి దొరికిందని ఎస్సై తెలిపారు. గంజాయిని, స్కూటీని సీజ్ చేసి విశాల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.