ఆర్టీసీలో సురక్షిత ప్రయాణం

ఆర్టీసీలో సురక్షిత ప్రయాణం

ప.గో: ఆర్టీసీలో సురక్షిత ప్రయాణం చేయవచ్చని తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ ఏలూరి సత్యనారాయణమూర్తి అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం ఆర్టీసి డిపోలో ఆచంట, జంగారెడ్డిగూడెం, భీమవరం రూట్లలో ప్రయాణికుల నుంచి లక్కీ డిప్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు ఆర్టీసీలో ప్రయాణించి, సంస్థ బలోపేతానికి సహకరించాలన్నారు. సహాయ మేనేజర్ సుధారాణి, పీఆర్వో పాల్గొన్నారు.