శివాలయానికి పోటెత్తిన భక్తులు

శివాలయానికి పోటెత్తిన భక్తులు

SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలోని తూర్పుబజారులో గల స్వయంభూ మహాదేవరాలింగేశ్వర స్వామి దేవాలయానికి శివరాత్రి సందర్భంగా శుక్రవారం భక్తులు తెల్లవారుజామునుంచే పోటెత్తారు. ఈ మేరకు ఆలయ అర్చకులు ఎర్ర హరికిషన్ కర్దమ ఆధ్వర్యంలో అభిషేకాలు, పూజలు చేసి భక్తులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు మధు, శ్రీశైలం యాదవ్, దశరథ, సోమన్న పాల్గొన్నారు.