BREAKING: విశ్వవిజేతగా భారత్
మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసి టీమిండియా విశ్వ విజేతగా అవతరించింది. ఫైనల్‌లో భారత్ నిర్దేశించిన 298 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా 246 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ లారా వోల్వార్ట్ సెంచరీతో పోరాడినప్పటికీ సౌతాఫ్రికాను గెలిపించలేకపోయింది. భారత బౌలర్లలో దీప్తి 5, షఫాలీ వర్మ 2 వికెట్లు పడగొట్టారు.