తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్

తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ వరుణ్ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు. తమ జీవితాల్లోకి మరొకరు వస్తున్నారని క్యాప్షన్ ఇచ్చాడు. లావణ్య చేతితో పాటు పిల్లల షూను పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేశాడు. దీంతో అభిమానులు, సెలబ్రిటీలు వారికి కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా.. వరుణ్, లావణ్య 2023లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.