VIDEO: ఘనంగా వందేమాతరం 150ఏళ్ల విజయోత్సవ వేడుకలు
కృష్ణా: వందేమాతరం పాటకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇలాపర్రు గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజలకు చైతన్యం నింపిన దేశభక్తి గీతమని, ఇది మనకు తల్లిదేశం పట్ల గల ప్రేమ, గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పంచాయతీ సిబ్బంది పేర్కొన్నారు. యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అత్యంత అవసరమని తెలిపారు.