పుట్టపర్తిలో చిల్డ్రన్ పార్కు ప్రారంభం

పుట్టపర్తిలో చిల్డ్రన్ పార్కు ప్రారంభం

సత్యసాయి: పుట్టపర్తిలోని చిత్రావతి నది వద్ద జాయ్‌ అలుక్కాస్‌ సంస్థ ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్కును మంత్రి సవిత, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రూ.1.20 కోట్ల వ్యయంతో పార్కును నిర్మించినట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా పట్టణ అభివృద్దిలో భాగంగా పార్కును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.