నేడు అద్దంకిలో వైసీపీ నేతల ర్యాలీ..!
BPT: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అద్దంకి నియోజకవర్గంలో సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని బుధవారం వైసీపీ శ్రేణులు నిర్వహించనున్నారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయం నుంచి బంగ్లా రోడ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తామని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ ఒక ప్రకటనలో వివరించారు.