ఈనెల 7న అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన

ఈనెల 7న అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన

KDP: మున్సిపల్ అధికారులు పెద్ద మొత్తంలో బకాయిలున్న వారిని వదిలేసి, పన్నుల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకులు వసూలు చేసిన జనరల్ ఫండ్‌ను దుర్వినియోగం చేస్తే సహించబోమన్నారు. ఈ అక్రమాలకు నిరసనగా ఈనెల 7న కడపలో అఖిలపక్షం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలన్నారు.