'ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి'
ప్రకాశం: ఒంగోలు నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. నగర అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై సమావేశంలో చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.