'కూటమి ప్రభుత్వంలో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం'
బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయాన్ని గురువారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పిల్లర్స్ పనులను ఆయన ప్రారంభించారు. అంతకుముందు విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తితోనే క్రమశిక్షణ, శాంతియుత జీవనం సాధ్యమని, గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.