ఎన్నికల నియమావళిని పాటించాలి: డీఎస్పీ
SRPT: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కుడకుడలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ఓటర్లను మద్యం, డబ్బుతో ప్రలోభపెట్టకుండా అభ్యర్థులు నిబంధనల ప్రకారం ప్రచారం చేసుకోవాలని సూచించారు. ప్రజలు గొడవలకు పోకుండా శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని, అల్లరి మూకలపై నిఘా ఉంటుందని అన్నారు.