గుండ్లకమ్మ జలాశయంలోకి 6 లక్షల చేప పిల్లలు

గుండ్లకమ్మ జలాశయంలోకి 6 లక్షల చేప పిల్లలు

ప్రకాశం: మద్దిపాడు మండలం గుండ్లకమ్మ జలాశయం వద్ద శనివారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో మీనోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ పాల్గొన్నారు. 6 లక్షల చేప పిల్లలను ఎమ్మెల్యే విజయ్ కుమార్, మత్స్య శాఖ అధికారులు గుండ్లకమ్మ జలాశయంలోకి వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.