గుత్తికోట ఉత్సవాలపై కమిషనర్ సమావేశం
ATP: గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్ర కలిగిన గుత్తి కోట పర్యాటక ఉత్సవాలను ఈనెల 14,15 తేదీలలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కోట ముఖద్వారం పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం, చెత్త చెదారం లేకుండా పనులను పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.