నేడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శంకుస్థాపన చేయనున్న సీఎం
GNTR: అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో వేంకటేశ్వరస్వామి ఆలయానికి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఉదయం 10.30 గం.లకు వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రెండు దశల్లో రూ.260 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే ఆలయ నిర్మాణం మొదటి విడత పూర్తైన సందర్బంగా రేపు శంకుస్థాపన అనంతరం రెండు, మూడవ విడత పనులు చేపట్టనున్నారు.