మార్కాపురం బస్సు ప్రమాదం.. ఇద్దరు అరెస్ట్
AP: మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో పోలీసులు వేగంగా చర్యలు చేపట్టారు. నిబంధనల ఉల్లంఘన, నిర్లక్ష్యంపై విచారణ జరిపి ప్రైవేట్ ట్రావెల్స్ యజమాని హరికృష్ణారెడ్డితో పాటు బస్సు డ్రైవర్ యువరాజ్‌ను అరెస్ట్ చేశారు. కాగా, మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమై 14 మంది సజీవదహనం అయిన విషయం తెలిసిందే.