కలెక్టర్ కార్యాలయం ముందు ఏఎన్ఎంల ధర్నా

కలెక్టర్ కార్యాలయం ముందు ఏఎన్ఎంల ధర్నా

SRD: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు ఎఎన్ఎంలు సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెహమాన్ మాట్లాడుతూ.. ఎఎన్ఎంలపై పని ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.