ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే
PLD: వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కార్యాలయంలో బుధవారం ప్రజల నుంచి వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. వసతి, విద్యుత్, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై ప్రజలు పెద్ద సంఖ్యలో వినతులు ఎమ్మెల్యేకి సమర్పించారు. ప్రతి వినతిని పరిశీలించిన జీవీ వెంటనే పరిష్కరించదగ్గ అంశాలపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.