స్వయంగా పరిసరాలను శుభ్రం చేసిన కలెక్టర్
కృష్ణా: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా కార్యాలయాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు కలెక్టర్ డీ.కె. బాలాజీ శ్రీకారం చుట్టారు. 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర'లో భాగంగా ఆర్&బి కార్యాలయంలో శనివారం పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కలెక్టర్ స్వయంగా అధికారులతో కలిసి పరిసరాలను శుభ్రం చేసి, సిబ్బందితో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.