ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్

WNP: వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని కానాయపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ ప్రారంభించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు.